Header Banner

నేను తప్పు చేశా క్షమించండి.. వైసీపీ ఎమ్మెల్యే సంచలనం! కారణం ఇదే!

  Wed Apr 09, 2025 07:01        Politics

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి వివాదంలో చిక్కుకున్నారు.చిప్పగిరిలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో సీతమ్మ వారి మెడలో తాళి కట్టారు.సాధారణంగా శ్రీరామ కళ్యాణోత్సవంలో అర్చకులు మాత్రమే సీతమ్మ వారికి తాళి కడతారు. అయితే, ఈసారి ఎమ్మెల్యే స్వయంగా తాళి కట్టడం వివాదాస్పదమైంది. ఈ చర్యను చాలా మంది హిందూ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇది సంప్రదాయానికి విరుద్ధమంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు భక్తులు ఎమ్మెల్యే చేపిన చర్య సరైంది కాదని విమర్శిస్తున్నారు.


ఇది కూడా చదవండిపవన్ కళ్యాణ్ కుమారుడికి స్కూల్లో గాయాలు.. జగన్ ఏమన్నారంటే..?


వివాదం పెద్దది కావడంతో ఎమ్మెల్యే వీరూపాక్ష సోషల్ మీడియా వేదికగా హిందువులందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పారు.శ్రీరామ నవమి సందర్భంగా తాను కేవలం ఒక భక్తుడిలా మాత్రమే వెళ్లాను కానీ మరో ఉద్దేశంతో కాదు, పూజలో కూడా కేవలం అర్చకులు చెబితేనే తాళిబొట్టు వేశాను కానీ నా సొంతంగా ఏ పని చేయలేదు అంటూ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పడం జరిగింది. 2024లో జరిగిన ఎన్నికల్లో విరుపాక్షి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024లో జరిగిన ఎన్నికలలో టీడీపీ తరుపున అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందినా, ఆలూరు నియోజకవర్గంలో మాత్రం వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి వీరూపాక్ష గెలుపొందారు.టీడీపీ తరుపున బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే వీరభద్ర గౌడ్ ఘోరంగా ఓటమి పాలయ్యారు.


ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #YSRCP #MLAVirupakshi #Controversy #HinduTradition #SriRamaNavami